Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు సృష్టించే కలకలం... సర్కస్ కార్-2

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (13:14 IST)
కారు మీద చాలా సినిమాలు వ‌చ్చాయి... కానీ, ఇలా స‌ర్క‌స్ కారుతో మ్యాజిక్ చేసిన సినిమా ఇదే. ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు సొంతదారు ఎవరో తెలియదు. ఆ ఊరివారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? వంటి ఆసక్తికర కథ-కథనాలతో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ "సర్కస్ కార్-2". 
 
 
నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూడా యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. 
 

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ, "సర్కస్ కార్" సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్ ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే "సర్కస్ కార్-2" మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది.  పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ "సర్కస్ కార్-2"కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు.
 

బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి), నిర్మాత: శివరాజు వి.కె, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments