నమితా బొట్టు చిత్రం విడుదల తేదీ ఖరారు..!

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (15:12 IST)
వడివుడయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బొట్టు. ఈ చిత్రంలో నమిత, ప్రేమిస్తే ఫేమ్ భరత్, ఇనియా, ఊర్వశి, షకీలా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.‌ఎస్. సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి.కుమార్ బాబు 'బొట్టు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
 
ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ... బొట్టు అనే పేరు గల ఓ యువతి కథే ఈ సినిమా. కాంచన, గంగ వంటి చిత్రాల తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వస్తున్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. కథాకథనాలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల వలన కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. 
 
చివరికి రివైజింగ్ కమిటీ ద్వారా విడుదలకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా తెలుకు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది. మరి సినిమా రిలీజ్ తరువాత ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments