Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి కానుకగా బాలయ్య "సింహా"

Webdunia
WD
బొబ్బిలిసింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం "సింహా".

భద్ర, తులసి వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో, యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ సెప్టెంబర్ 4 నుంచి 19వ తేదీ వరకు రామోజీ ఫిలింసిటీలో జరిగింది.

ఈ షెడ్యూల్ గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. హీరో బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఫైట్‌ని, బాలకృష్ణ, స్నేహాఉల్లాల్ కాంబినేషన్‌లో చిత్రీకరించామన్నారు. 21 నుంచి హైదరాహాద్ సిటీలో నవంబర్ చివరి వరకు ఏకధాటిగా ఈ షెడ్యూల్ జరుగుతుందని నిర్మాత వెల్లడించారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. మహేంద్రబాబు మాట్లాడుతూ.. డిసెంబర్‌లో వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుందని, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

యువరత్న బాలకృష్ణ, స్నేహాఉల్లాల్, నమిత, రఘు, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్, కె.ఆర్.విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, అలీ, ధర్మవరపు, కృష్ణభగవాన్, ఎల్.బి.శ్రీరాం, ఝాన్సీ, సన, సైరాభాను, వినోద్, ప్రముఖ మలయాళ విలన్ సాయికుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఫోటోగ్రఫీ: ఎ.విల్సన్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. యోగానంద్.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments