Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి కానుకగా వెంకీ, త్రిషల "నమో వెంకటేశ"

Webdunia
విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, డి. సురేష్‌బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధమైంది. 

జనవరి 4, 5, 6, 7 తేదీల్లో బ్యాంకాక్‌లో వెంకటేష్, హీరోయిన్ త్రిషలపై 'నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం.. భూమ్మీదెలా ఇక నిలవడం..' అన్న పల్లవిగల పాటను చిత్రీకరించడంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు రాము, గోపి, అనిల్ తెలిపారు.

దర్శకులు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. 'నమో వెంకటేశ' చిత్రాన్ని వెంకీతో రూపొందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన కెరీర్‌లో వెంకీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం బంపర్ హిట్ అవుతుందన్నారు. పూర్తి వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూసి ఆనందించే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోందని శ్రీనువైట్ల తెలియజేశారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకులు అన్నారు. ఇంకా సినిమాను అద్భుతంగా మలచేందుకు తన స్నేహితులైన నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సహకరించారని చెప్పారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విందు భోజనం లాంటి ఈ సినిమా తప్పకుండా యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు సంపాదించిపెడుతుందని శ్రీనువైట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.

వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, కోట శ్రీనివాసరావు, జె.పి. ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనువైట్ల.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments