శ్రీహరి, ఆర్యన్ రాజేష్ కలిసి నటించిన చిత్రం "రోమియో". దీనికి ఎ డిఫరెంట్ లవర్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. సుధ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల మూడోవారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు చెప్పినదానికంటే ఈ సినిమాను చాలా బాగా మలిచారని తెలిపారు.
ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను కలుగజేసే చిత్రమిదని, ఇందులో ఓ ధనవంతుడైన వ్యక్తి పాత్రను శ్రీహరి పోషించారు. కథానాయిక అయిన శ్రీహరి చెల్లెలి ప్రేమను హీరో ఎలా పొందాడన్న విషయాన్ని తెరపై చూడాల్సిందేనని నిర్మాత వెల్లడించారు. మధుర ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని శ్రీనివాస్ తెలిపారు.
దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. శ్రీహరి, ఆర్యన్ రాజేష్‌లు తమ తమ పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పారు. ఇందులో శ్రీహరికి ఆపోజిటివ్ విలన్ పాత్రలో చరణ్‌రాజ్ నటించగా, శ్రీహరికి పి.ఎ పాత్రను రఘుబాబు పోషించారని ఆయన తెలిపారు.
పాటలతో పాటు మంచి ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయని రామకృష్ణ చెప్పుకొచ్చారు. కాగా సంప్రదాయానికి గౌరవమిచ్చి, ప్రేమపట్ల నమ్మకం కలిగిన అమ్మాయి పాత్రను హీరోయిన్ శ్రద్ధాఆర్య పోషించిందని ఆయన వివరించారు.
ఇంకా ఈ చిత్రం చంద్రమోహన్, తనికెళ్ళభరణి, సంతోష్‌పవన్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, సుమన్‌శెట్టి, గౌతంరాజు, సైరాభాను, వైజాగ్ ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: అగస్త్య, కెమెరా: రాజేంద్ర, నిర్మాత: శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామకృష్ణ.