విడుదలకు సిద్ధమైన "గాలిశీను"

Webdunia
WD
మెంటల్‌కృష్ణ, రాజావారి చేపల చెరువు వంటి చిత్రాల ద్వారా హీరోగా ముద్రవేసుకున్న ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళి "గాలిశీను" ద్వారా తెరపైకి రానున్నారు. పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి స్వప్నమూవీస్ పతాకంపై ఎం.వి. కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.

టైటిల్ రోల్‌ను హనీఫ్ అనే నూతన నటుడు పోషిస్తుండగా, మెంటల్ కృష్ణ ఫేమ్ సత్యకృష్ణన్ మళ్లీ గాలిశీనులో హీరోయిన్‌గా నటించడం విశేషం. వీధి రౌడీ నుంచి డాన్ స్థాయికి ఎదగాలనుకునే రౌడీ కథే గాలిశీను అని దర్శకుడు తెలిపారు. చక్కటి హాస్యభరిత చిత్రంగా గాలిశీను తెరకెక్కనున్నాడని ఆయన తెలిపారు.

తెలుగులో పలు సీరియల్స్ చేసిన తాను దాసరి నిర్మించిన "మధ్యతరగతి మహాభారతం" చిత్రానికి దర్శకత్వం వహించానని, ప్రస్తుతం వెంగమాంబకు దర్శకత్వం వహిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ పూర్తయి సెన్సార్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.

ఆర్.కె.ఫిలిమ్స్ ద్వారా రామకృష్ణ గౌడ్ సహకారంతో గాలిశీనును విడుదల చేస్తున్నామని నిర్మాత కృష్ణ ప్రసాద్ అన్నారు. యాక్షన్, కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని ఆయన వెల్లడించారు.

ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని, ఆద్యంతం వినోదభరితంగా గాలిశీను రూపుదిద్దుకున్నాడని ఆర్.కె. ఫిలిమ్స్ పంపిణీదారుడు రామకృష్ణగౌడ్ అన్నారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: అర్జున్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్యం... కత్తులతో నరికివేశారు....

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

Show comments