ప్రతి సీన్ థ్రిల్ కలిగిస్తుంది!!
' గజిని' తర్వాత సూర్యకి తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. ఆ లోటుని మా 'కంచు' చిత్రం భర్తీ చేస్తుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి ఎక్స్‌లెంట్ సంగీతాన్ని అందించాడు. ఆడియో సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డ్‌ని యువన్‌శంకర్ రాజా అందుకున్నారు. యూత్‌కి నచ్చేవిధంగా వెన్నెలకంటి మాటలు, పాటలు అందించారు. ప్రముఖ దర్శకుడు అమీర్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి మరో హైలైట్‌గా చెప్పవచ్చు. ఆద్యంతం ఆహ్లాదకరంగా ప్రతి సీన్‌ని రక్తికట్టించాడు.
సినిమా చూస్తున్నంతసేపు ఇది మన లవ్ స్టోరీయేనా అనిపిస్తుంది. అలాగే యాక్షన్ సన్నివేశాలు సూర్య స్టైల్‌లో డిఫరెంట్‌గా వుంటాయి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు థ్రిల్ కలిగించేలా ఈ సినిమా వుంటుంది. సూర్య కెరీర్‌లో ఈ సినిమా మంచి హిట్ చిత్రంగా నిలుస్తుంది. అలాగే తెలుగులో సూర్యకు సూపర్‌హిట్ ఫిలిమ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ వుంది. 'కంచు' సినిమా పెద్ద హిట్ అయి డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.