Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రవితేజ "నిప్పు"

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (15:39 IST)
WD
రవితేజ, దీక్షాసేథ్‌ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వై.వి.యస్‌.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'నిప్పు' సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న మహాశివరాత్రి పండుగ కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత వై.వి.యస్‌.చౌదరి మాట్లాడుతూ - ''మా బేనర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'నిప్పు' సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు అందరి ఆదరణ పొందాయి. అలాగే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్‌కి కూడా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది.

రవితేజ, గుణశేఖర్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

రవితేజ సరసన దీక్షాసేథ్‌ కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో డ ా|| రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌ దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్‌ సీపన, సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, గణేష్‌ తరుపాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌.కిషోర్‌, కో-ప్రొడ్యూసర్స్‌: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వైౖ.వి.యస్‌.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments