Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో రానున్న "మన్మధులు"

Webdunia
యువనిర్మాత వి. సురేష్ చౌదరి నిర్మించి తమిళంలో విజయవంతమైన "కాదల్ కదై" చిత్రాన్ని 'మన్మధులు' పేరిట తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూర్యపవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై సూర్యడీజిల్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది.

అంతా కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న 'మన్మధులు' చిత్రం గురించి నిర్మాత వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. ఒక కొత్త పాయింట్‌తో వచ్చిన ప్రేమకథా చిత్రమిదన్నారు. దీన్ని దర్శకుడు వేలురాజా ఎంతో శ్రమించి అన్ని తరగతుల వారికి నచ్చేలా అన్ని అంశాల్ని మేళవించి తీర్చిదిద్దారని చెప్పారు. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయన్నారు.

ఓ ప్రయోగాత్మక చిత్రంగా దర్శకుడు దీన్ని కొత్త పాయింట్‌తో మలిచారని నిర్మాత వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అదేవిదంగా దీనికి ఆయన అద్భుతంగా రీరికార్డింగ్‌ని పూర్తి చేశారు. "మన్మధులు" చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

అతిరూపన్, ప్రీతిరంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రల్ని పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రాజశేఖర రెడ్డి సంభాషణలను అందించారు.

ఇంకా ఈ చిత్రానికి గీత రచయిత: పోందూరి, ఎడిటింగ్: మధు సాంకేతిక వర్గం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments