Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్‌ 20న కార్తీ, హన్సిక 'బిరియాని'

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2013 (16:59 IST)
WD
యుగానికి ఒక్కడు, ఆవారా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో చక్కని ఇమేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో కార్తీ లేటెస్ట్‌గా స్టూడియో గ్రీన్‌ బేనర్‌లో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రం 'బిరియాని'. 'మంగాత్తా'(గ్యాంబ్లర్‌) వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన వెంకట్‌ ప్రభు ఈ చిత్రాన్ని తనదైన స్టైల్‌లో విభిన్నంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఆడియో డిసెంబర్‌ 6 విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా తెలియజేస్తూ - ''కార్తీ ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఈ చిత్రంలో చేస్తున్నారు. యాక్షన్‌తోపాటు కామెడీ కూడా వుండే ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే అంశాలు చాలా వున్నాయి. కార్తీ, హన్సిక ఫస్ట్‌టైమ్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో మెండీ థాకర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే యువన్‌ శంకర్‌రాజాకి ఇది 100వ సినిమా. యువన్‌ చాలా అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 6న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

కార్తీ, హన్సిక, మెండీ థాకర్‌, ప్రేమ్‌జి అమరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శక్తి శరవణన్‌, ఎడిటింగ్‌: ప్రవీన్‌ కె.ఎల్‌-ఎన్‌.బి.శ్రీకాంత్‌, ఫైట్స్‌: శివ, ఆర్ట్‌: వితేష్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, డాన్స్‌: రాజు సుందరం, సహనిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments