Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15న తెరపైకి వస్తోన్న "లైఫ్‌స్టైల్‌"

Webdunia
WD
ముప్పలనేని శివ దర్శకత్వంలో కోగంటి రామకృష్ణ, మాధవ్‌ పట్నాయక్‌ నిర్మించిన చిత్రం ' లైఫ్‌స్టైల్‌'. నిశ్చల్‌, కార్తీక్‌, అనన్య, మీనాక్షి దీక్షిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుందని దర్శకుడు ముప్పలనేని శివ తెలియజేశారు.

మంగళవారం రాత్రి సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివ మాట్లాడుతూ, తాను గతంలో నిర్మించిన తాజ్‌మహల్‌, అమ్మాయికోసం వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రముంటుందని చెప్పారు.

నిర్మాత కోగంటి రామకృష్ణ మాట్లాడుతూ, అన్నిటికంటే స్నేహం గొప్పదని తెలియజెప్పే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. స్నేహంకోసం త్యాగాలు చేయడం, కొన్ని కష్టాలు అనుభవించడం, ఆపై గోల్‌ను సాధించడం వంటివి ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత వెల్లడించారు. యువతకు చక్కని సందేశంకూడా ఇందులో ఇమిడి ఉందని ఆయన తెలిపారు.

మొదటి భాగం కాలేజీ నేపథ్యంలోనూ, రెండవ భాగం కుటుంబకథా చిత్రంగా తీర్చిదిద్దినట్లు నిర్మాత అన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌, సంగీతం: శ్రీజ.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments