Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 11న వస్తోన్న పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2012 (18:28 IST)
WD
' నువ్‌ నందావైతే నేను బద్రి.. బద్రినాథ్‌' ఈ డైలాగ్‌ అప్పట్లో ఎంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ షేక్‌ అయింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌-డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'బద్రి' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. 2000 సంవత్సరంలో వచ్చిన 'బద్రి'తో పవన్‌, పూరీల కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. ఐతే.. ఈ కాంబినేషన్‌ కోసం అప్పట్నుంచీ ఎదురుచూస్తున్నారు అందరూ.

మళ్ళీ పన్నెండేళ్ళ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'ను సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బేనర్‌పై నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి.దానయ్యను అడిగినపుడు - ''పవన్‌ కళ్యాణ్‌గారు పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు ఈ సినిమాలో. పవర్‌స్టార్‌ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా పూరి జగన్నాథ్‌గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, సూపర్‌సాంగ్స్‌తో, థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో ప్రేక్షకులు పవన్‌ అభిమానులు అందరూ మెచ్చే విధంగా 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' రూపొందుతోంది. ఈ నెల 31కి టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది.

సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌ రెండు పాటలు చిత్రీకరించడంతో చిత్రంలోని ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటాయి. మా బేనర్‌లో, పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. పూరి జగన్నాథ్‌గారు పవర్‌స్టార్‌ కోసం రాసిన సూపర్‌ డైలాగ్స్‌కు థియేటర్‌లో చప్పట్లతో దద్దరిల్లుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేయగలిగామంటే పూరిగారి ప్లానింగ్‌, పవన్‌కళ్యాణ్‌గారి హార్డ్‌ వర్క్‌ ప్రధాన కారణాలు.

పవన్‌కళ్యాణ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఇంత పెద్ద సెన్సేషనల్‌ ఫిలిమ్‌ తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుంది. ఈ చిత్ర నిర్మాణంలో అన్నివిధాలా ఎంతో సహకరిస్తున్న మా పవన్‌ కళ్యాణ్‌గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌గారితో మళ్ళీ ఇన్నేళ్ళకు సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌గారి నుంచి ఎలాంటి పవర్‌ఫుల్‌ సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారో అలాంటి పవర్‌ఫుల్‌ సినిమా ఇది. డెఫినెట్‌గా కళ్యాణ్‌ కెరీర్‌లో ఓ ల్యాండ్‌మార్క్‌ ఫిలిమ్‌ అవుతుంది. ఇందులో ఓ కొత్త పవన్‌ కళ్యాణ్‌ని చూస్తారు'' అన్నారు.

హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ - ''పవన్‌ కళ్యాణ్‌గారితో చేస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది. పవన్‌గారితో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. అలాగే పూరి జగన్నాథ్‌గారు లాంటి బ్రిలియంట్‌ డైరెక్టర్‌తో ఫస్ట్‌టైమ్‌ చేస్తున్నాను. కెమెరామెన్‌ గంగ క్యారెక్టర్‌ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న క్యారెక్టర్‌'' అన్నారు.

క్లైమాక్స్‌ సన్నివేశం జరుగుతుండగా ఎమోషనల్‌గా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన పెద్ద డైలాగ్‌కి షాట్‌లో వున్న వేలాదిమంది జూనియర్‌ ఆర్టిస్టులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపితే దర్శకుడు పూరి జగన్నాథ్‌ పవన్‌ కళ్యాణ్‌ని హగ్‌ చేసుకొని అభినందించారు. ఇలాంటి సూపర్‌ సీన్స్‌ ఈ సినిమాలో చాలా వుంటాయి.

మణిశర్మ సూపర్‌హిట్‌ సాంగ్స్‌
ఈ చిత్రం కోసం మణిశర్మ 5 సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. పూరి-మణి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి', 'చిరుత' వంటి మ్యూజికల్‌ హిట్స్‌ తర్వాత వస్తోన్న మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌ ఇది. సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఈ ఆడియోలో 5 పాటలూ దేనికదే హైలైట్‌ అవుతాయి.

పవన్‌కళ్యాణ్‌, తమన్నా, గేబ్రియల్‌, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: చిన్నా, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, స్టిల్స్‌: మాగంటి సాయి, కో-డైరెక్టర్‌: విజయరామ్‌ప్రసాద్‌, నిర్మాణం యూనివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments