Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ కళారూపాల రికార్డు అమ్మకాలు

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (21:00 IST)
FileCMCG
సమకాలీన భారతీయ కళకు సంబంధించి ఆటమ్ ఆన్‌లైన్ వేలాన్ని సుప్రసిద్ధ ఆక్షన్ సంస్థ శాఫ్రన్ ఆర్ట్ గురువారం రాత్రి ముగించింది. ఈ వేలంపాటలో భారతీయ కళారూపాలు 18 ప్రపంచ రికార్డులను కొత్తగా సృష్టించడమే కాక రూ29 కోట్ల అమ్మకాలను సాధించి కళా ప్రపంచాన్ని నివ్వెరపర్చాయి. ముందుగా అంచనావేసుకున్న మొత్తం కంటే 72 శాతం అధిక మొత్తంలో ఇవి అమ్ముడుపోవడం విశేషం.

వీటిలో భారతీయ చిత్రకారులైన టివి. సంతోష్, అంజు దోదియా, సుధీర్ పట్వర్ధన్ మరియు 15మంది ఇతర ఆర్టిస్టుల కళారూపాలను కొనుగోలుచేయడంలో కొత్త ప్రపంచ ఆక్షన్ రికార్డులు బద్దలయ్యాయి. వీటిలో నాలుగు చిత్రాలను కోటిరూపాయలకంటే అధికమొత్తంలో అమ్ముడుపోవడం విశేషం. ఒక సుబోధ్ గుప్తా చిత్రాలే రూ4 కోట్లను దాటడం మరీ విశేషం.

ఈ మేటి ఆక్షన్ కోసం 32 దేశాల నుంచి 575 మంది బిడ్డర్‌లు నమోదు చేసుకోవడం గమనార్హం. శాఫ్రన్ ఆర్ట్ సంస్థ యొక్క నూతన సాంకేతిక వేదికపై పెయింటింగ్, శిల్పకళ, ఫోటోగ్రఫీ మరియు ఇన్‌స్టలేషన్ వంటి సమకాలీన భారతీయ కళారూపాలను ఆన్‌లైన్ వేలం వేసినప్పుడు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ కొనుగోలు ప్రక్రియలో టివి సంతోష్, అంజు దోదియా, సుధీర్ పట్వర్ధన్, జిఆర్ ఇరానా, మిథు సేన్, అనితా దుబె, సుదర్శన్ సెట్టి, అనిల్ రేవ్రీ, తుషార్ జోగ్, మనీషా పరేఖ్, దేవాంజన్ రాయ్, ఫణీంద్ర్ నాథ్ చతుర్వేది, కిషోర్ షిండే, చిత్ర గణేష్, రవికుమార్ కాశీ, రామ్ బాలి చౌహాన్, మయూర్ కైలాష్ గుప్తా మరియు నికోలా దుర్వాసుల వంటి 18 మంది భారతీయ చిత్రకారుల సృజనలు ప్రపంచ రికార్డు అమ్మకాలను సాధించాయి.
< /td>
WD


ఆక్షన్ మొదలైన గంటలలోపే వీరిలో అనేకమంది చిత్రాలు తాము అంచనా వేసిన మొత్తాలకంటే అధికంగా కోట్ కావడం విశేషం. చివరకు అమ్మకాలు ముగిసే చివరి క్షణాల్లో కూడా బిడ్డింగ్ కొనసాగిందంటే ఈ వేలం ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వేలంలో భారతదేశానికి చెందిన అత్యంత ప్రతిభావంతులైన కొంతమంది కళాకారుల చిత్రాలను కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా 575 మంది బిడ్డర్‌లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ శాఫ్రన్ ఆర్ట్ వేలంలో సుబోధ్ గుప్తా ఐడోల్ థీఫ్ చిత్రం అత్యధికంగా రూ4.28 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ చిత్రకారుడి మరో చిత్రం సాత్ సముద్ర పార్‌‌కు రూ3.4 కోట్లు లభించగా, టివి సంతోష్ గీసిన మరో చిత్రానికి రూ2.8 కోట్లు దక్కాయి. అంజూ దోదియా గీసిన ది సైట్ చిత్రం రూ1.06 కోట్లు పలుకగా, సుధీర్ పట్వర్థన్ చిత్రానికి రూ93,15,000లు పలికింది.

ఆధునిక, సమకాలీన భారతీయ కళారూపాలకు మార్కెట్‌ను మౌలికంగా మార్చివేయడంలో శాఫ్రన్ ఆర్ట్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. తన వృత్తిపరతత్వం, పారదర్శకతలతో ఈ సంస్థ భారతీయ కళారూపాలపై దేశీయంగా, అంతర్జాతీయంగా బిడ్డర్లలో ఆసక్తిని బాగా పెంచగలిగింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక, సమకాలీన భారతీయ కళారూపాల వేలంపాటకు సంబంధించి ఇది లీడర్‌గా ఆవిర్భవించింది.

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

Show comments