Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తుకారాం" కవిత్వానికి లిథువేనియన్ల పట్టం...!

Webdunia
ప్రముఖ మరాఠా కవి భక్త తుకారాం రచనలు ఇప్పుడు ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లిథువేనియన్ ప్రజలు తుకారాం కవిత్వానికి పట్టం గట్టడాన్నే.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన రచనలు ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్, డచ్, జర్మన్, ఇస్పెరండో, స్పానిష్, పోలిష్ బాషల్లో ప్రచురితమయ్యాయి.

ఇప్పుడు తాజాగా... యూరప్ ఖండంలోని లిథూనియా దేశ మాతృభాష అయిన లిథువేనియన్‌లోకి భక్త తుకారాం కీర్తనలు, ఇతర గ్రంథాలు తర్జుమా అయ్యాయి. మూడు శతాబ్దాల తరువాత కూడా వాడిపోని తుకారాం "భక్తి తత్వానికి" సర్వమానవాళి నీరాజనాలు పలకడం ఇదే మొదటిసారేమీ కాదు.

17 వ శతాబ్దంలో భక్తి ఉద్యమాలకు చిరునామాగా నిలిచిన తుకారాం... నాటి సమాజంలోని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పేదసాదల భాగ్యోదయాన్ని ఆకాంక్షిస్తూ తన రచనల్లో వ్యక్తపరిచారు. అన్ని కాలాలకు పనికివచ్చే సూక్తిసుధను మానవాళికి ఆ రకంగా పంచారు. ఈ కారణంగానే ప్రపంచం ఆయన రచనలతో మమేకం అవగలుగుతోంది.

ఇదిలా ఉంటే... ఏ సంస్కృతి, ఏ సమాజానికయినా వర్తించే కవిత్వంగా తుకారం రచనలను.. ప్రముఖ కవి దిలీప్ చిత్రే అభివర్ణించారు. కాగా... దిలీప్ చిత్రే, తుకారాం రచనలను ఇంగ్లీష్ బాషలోకి అనువదించటంలో ముఖ్య పాత్రను పోషించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

Show comments