Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ సేతుప‌తిటైటిల్ పాత్ర‌లో ‘విడుద‌లై’

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:54 IST)
Vijay setupati
వైవిధ్య‌మైన చిత్రాల్లో, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న మ‌క్క‌ల్ సెల్వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, యూనిక్ కాన్సెప్ట్ చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్న జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ వెట్రి మారన్ దర్శకత్వంలో కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే దక్షిణాది ప్రముఖ నిర్మాత ఎల్‌రెడ్ కుమార్, ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్ ‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం ‘విడుదలై’. ఈ సినిమాలో క‌మెడియ‌న్ సూరి న‌టిస్తున్నారు. ఈ సినిమాలకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించనున్నారు. తొలిసారి వెట్రిమారన్, ఇళయరాజా కాంబినేషన్‌లో సినిమా సినీ ప్రేక్షకులను మెప్పించనుంది. 
 
కరెంట్, టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోని దట్టమైన పశ్చిమ కనుమల్లోని అడవుల్లో విజయ్ సేతుపతి, వెట్రిమారన్, సూరి, భవాని శ్రీ సహా ఎంటైర్ యూనిట్ అడవుల్లో ఉండే గిరిజన ప్రజలతో ఉంటూ ‘విడుదలై’ సినిమా షూటింగ్‌ను చేశారు. 
 
‘అసుర‌న్‌’ వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అంతే స్ట్రాంగ్ కంటెంట్‌తో డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ ‘విడుదలై’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆకట్టుకునే ట్విస్టులు, టర్న్‌లు..గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది. వెట్రి మార‌న్ సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించే సినిమాటోగ్రాఫ‌ర్ వేల్‌రాజ్, ఎడిటింగ్ వ‌ర్క్‌ను ఆర్‌.రామర్‌, పీట‌ర్ హెయిన్ యాక్ష‌న్స్ సీక్వెన్స్‌ను అందిస్తున్న ఈ చిత్రానికి జాకీ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి  నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments