Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. దేవసేన కొత్త పోస్టర్ రిలీజ్.. నీలిరంగు చీరలో?

బాహుబలి 2 సినిమా కొత్త రికార్డులను సృష్టించేందుకు.. పాత రికార్డులను బద్ధలు కొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సైతం సత్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (17:06 IST)
బాహుబలి 2 సినిమా కొత్త రికార్డులను సృష్టించేందుకు.. పాత రికార్డులను బద్ధలు కొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సైతం సత్తా చాటింది. విదేశాల్లో సైతం రికార్డు స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగులు అవుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పలు హాలీవుడ్ సినిమాలను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
 
గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ గులాన్ మాట్లాడుతూ, రీసెంట్ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8'కి కూడా ఈ స్థాయిలో బుకింగ్స్ జరగలేదని,  లక్షకు పైగా టికెట్లు ఇప్పటికే బుక్ అయినట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. బాహుబలి-2 సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అనుష్క లుక్‌ని బయటపెట్టారు మేకర్స్. 
 
కుంతల యువరాణి దేవసేనగా అనుష్క కొత్త పోస్టర్‌ని బుధవారం విడుదల చేశారు. అనుష్క నీలిరంగు చీరలో రాజసం ఉట్టి పడేలా చాలా అందంగా కనిపించింది. బాహుబలి ది బిగినింగ్‌లో డీ గ్లామర్‌గా కనిపించిన అనుష్క.. పార్ట్-2లో మాత్రం అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments