Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ప్రేమికుల రోజు జరుపుకోండి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో, మీ జీ తెలుగులో...

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:58 IST)
ప్రతీ సందర్భానికి ఒక రోజు ఉన్నట్లే.. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కూడా ఒక రోజు ఉంది. అది ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు. ఈ ప్రేమికుల రోజు.. ప్రతీ ఒక్కరూ తాము ప్రేమించేవారికి తమ ప్రేమను మరింత గొప్పగా చెప్పాలనుకుంటారు.
 
అందుకే ఈ సందర్భాన్ని ఒక మర్చిపోలేని రోజుగా మార్చాలని భావించిన జీ తెలుగు ఒక మధ్య తరగతి కుటుంబంలో ప్రేమ మరియు మమతానురాగాలు ఏవిధంగా ఉంటాయో చూపించండానికి ఈ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనుంది జీ తెలుగు.
 
గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. అయితే, గుంటూరులో హోటల్ పెట్టి అక్కడి ప్రజలకు తన బొంబాయి చట్నీ రుచి చూపించి ఫేమస్ అయిపోవాలని రాఘవ కలలు కంటూ ఉంటాడు. కానీ, గుంటూరులో హోటల్ పెట్టడం రాఘవ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు.
 
మరోవైపు వరసకు మావయ్య అయ్యే నాగేశ్వరరావు కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. కానీ సంధ్యకు వాళ్ల నాన్న వేరే సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు? సంధ్యను పెళ్లి చేసుకున్నాడా? ఈ క్రమంలో రాఘవ ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాలు ఈ సినిమాలో చూడాలి. సో మిస్ అవ్వకుండా ఈ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 న  మధ్యాహ్నం 12 గంటలకు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ను చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ డెత్

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

చైనీస్ బాస్‌కి ఫ్లోర్‌లో పడుకుని పాదాభివందనం.. మిరపకాయలు తినాలి.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments