Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే.నగర్ బైపోల్ : బాబాయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు : ఇళయరాజ కుమారుడు

చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న తమ బాబాయ్ గంగై అమరన్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా స్పష్టం చేశారు.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (10:40 IST)
చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న తమ బాబాయ్ గంగై అమరన్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా స్పష్టం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గంగై అమరన్... సినీ ప్రముఖులు, వ్యాపారుల మద్దతు కోరుతూ ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా కలుసుకున్నారు. ఆ తర్వాత గంగై అమరన్‌కు రజనీ మద్దతు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగగా, దాన్ని సూపర్ స్టార్ ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో.. యువన్ శంకర్ రాజా కూడా బాబాయ్‌కు మద్దతివ్వడం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఆయన గెలిస్తే స్వాగతిస్తాను తప్ప, ఎలాంటి మద్దతూ ఇవ్వబోనని యువన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, తన తండ్రి ఇళయరాజాను ఉద్దేశించి గంగై అమరన్ చేసిన విమర్శల కారణంగానే యువన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments