Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్ థియేట్రికల్ రిలీజ్

డీవీ
సోమవారం, 7 అక్టోబరు 2024 (16:30 IST)
Yuva Chandra Krishna, Ananya
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ ఇంపార్టెంట్, పవర్ ఫుల్ రోల్  పోషిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన అజయ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 'పొట్టేల్' అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మంగళవారం (అక్టోబర్ 29) దీపావళి సెలవు సినిమాకి అడ్వాంటేజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, వారి కుమార్తె ఇంటెన్స్ ఫేస్ లతో ప్రజెంట్ చేసింది. మరో పార్ట్ లో హీరోని గ్రామస్తులు వెంబడిస్తున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది.
 
ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. టీజర్‌ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది.  
 
ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.
 
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments