Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమలో యాత్ర కోసం ఎగబడుతున్నారు... ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (16:13 IST)
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాత్ర శుక్రవారంనాడు విడుదలైంది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వసూలవుతాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటిరోజు రూ. 5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. మరోవైపు యాత్రను చూసేందుకు ప్రత్యేకించి రాయలసీమలో ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే సాగితే యాత్ర భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయం. 
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు దేశంలోనే అప్పట్లో చర్చనీయాంశమైంది. వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్సార్. ఆయన చేసిన పాదయాత్ర ఇతివృత్తంగా యాత్ర చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం శుక్రవారం 8న ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్లలో విడుదలైంది. చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
 
ప్రేక్షకులంతా వైఎస్సార్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అదరగొట్టాడని అంటున్నారు. వైఎస్సార్ పాత్రలో రాజన్న తిరిగి వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారని పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా వంటి డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments