Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మా` ఎన్నిక‌ల‌కు వై.ఎస్‌.జ‌గ‌న్‌కు సంబంధం లేదుః పేర్ని నాని

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (16:04 IST)
Perni Nani
ఈనెల 10న జ‌ర‌గ‌బోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నిక‌ల తంతు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపైనా ప‌డింది. హైద‌రాబాద్‌లోని `మా` బిల్డింగ్ గురించి, ఇక్క‌డే వుంటున్న న‌టీనటుల సంఘం గురించి పోటీపోటీగా కొంద‌రు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఎ.పి. మంత్రి పేర్ని నాని కూడా రంగంలోకి దిగి `మా` ఎన్నిక‌ల‌పై సోమ‌వారంనాడు ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
 
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
 
సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ, అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,,  ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
 
అస‌లు మంత్రి రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిట‌ని ఆరాతీస్తే, మంచు విష్ణు వెనుక జ‌గ‌న్ వున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిన్న‌నే ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌కు మోహ‌న్‌బాబు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. అందులో. మీరు వై.ఎస్‌. జ‌గ‌న్‌కు బంధువు, చుట్ట‌రికాలు వున్నాయి క‌దా. `మా` ఎన్నిక‌ల‌లో ర‌చ్చ ఏమిట‌ని? అదేవిధంగా ఆన్‌లైన్ టికెట్‌పై కూడా జ‌గ‌న్‌గారిని మీరే అడ‌గ‌వ‌చ్చుగ‌దా? అని ప్ర‌శ్న‌వేయ‌గా అందుకు మోహ‌న్‌బాబు తగువిధంగా స్పందించారు. క‌ట్‌చేస్తే, మ‌రుస‌టిరోజే అన‌గా సోమ‌వారం పేర్ని నాని క్లారిటీ ఇవ్వాల్సివ‌చ్చింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments