Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటీసు వెనక్కి తీసుకోండి.. లేదంటే చట్టపరంగా చర్యలు : అమీర్‌కు యూట్యూబర్ హెచ్చరిక

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (09:22 IST)
ఇటీవల రషీద్ సిద్ధిఖీ అనే యూట్యూబర్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పరువు నష్టం నోటీసును పంపించారు. మొత్తం రూ.500 కోట్లకు ఈ పరువు నష్టం దావా వేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తనపై అసత్య ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించారంటూ పేర్కొంటూ అమీర్ ఖాన్ నోటీసు పంపించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
బాలీవుడ్ హీరో నోటీసుకు యూట్యూబర్ ధీటుగానే స్పందించారు. అక్షయ్ కుమార్ తన పరువునష్టం ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా అక్షయ్ కుమార్‌కు నోటీసులు పంపాడు. 
 
హీరో అక్షయ్ కుమార్ తన గురించి, తన యూట్యూబ్ చానల్ ఎఫ్ఎఫ్ న్యూస్ గురించి చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని రషీద్ స్పష్టం చేశాడు. తనను ఎదగనివ్వకుండా చేసేందుకే నోటీసులు పంపారని ఆరోపించాడు.
 
ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందని, రషీద్ సిద్ధిఖీ యూట్యూబ్ వీడియోల్లో అభ్యంతరకర విషయాలు లేవని అతడి తరపు న్యాయవాది నోటీసుల్లో వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments