Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్ చందు సాయి అరెస్ట్.. అత్యాచారం.. పెళ్లి పేరిట మోసం

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (17:28 IST)
Sai
సామాజికంగా ఉపయోగపడే, సందేశం ఇచ్చే వీడియోలతో యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం, మోసం చేశాడనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందు సాయిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
 
హైదరాబాద్ నగర శివారు నార్సింగికి చెందిన యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందు సాయిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో చందు సాయి తనను మోసం చేసి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
తనను పట్టించుకోకుండా ముఖం చాటేశాడని చెప్పింది. మోసపోయానని తెలుసుకున్న యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో చందు సాయిపై అత్యాచారం, చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
 
తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చందు సాయి చెప్పాడని బాధితురాలు తెలిపింది. 2021 ఏప్రిల్ 25న తన పుట్టినరోజు అని చెప్పి ప్రేమ పేరుతో ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. 
 
చందు సాయి అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్.. చందు సాయి ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌తో పాటు అతని తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
నార్సింగి పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ సాయికిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మధ్య చందు సాయి యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. చందు గాడు, పక్కింటి అబ్బాయి లాంటి యూట్యూబ్ ఛానెల్స్‌లో వీడియోలు చేసేవాడు.
 
కామెడీ వీడియోలు, మంచి సందేశం ఇచ్చే వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చందు సాయి రూ.కోటి సంపాదిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments