Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ లేకున్నా సాహో చిత్రం షూటింగ్ షురూ... విలన్‌గా సరిజోడు నీల్ నితిన్

ఒక భారతీయ సినిమాలోని పాటలు, దృశ్యాలు, విజువల్స్‌ని భాష అర్థం కాకున్నా దక్షిణాఫ్రికా నుంచి అమెరికా దాకా, గల్ఫ్ కంట్రీస్ నుంచి లాటిన్ అమెరికా వరకు దేశదేశాల ప్రేక్షకులు తమ సొంతం చేసుకుని అద్భుతం అంటూ వ్యాఖ్యానిస్తూ ఒక్క పదం తెలియకున్నా తెలుగులో పాటలు నే

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (04:34 IST)
సినిమా విజయం  ఏ రేంజిలో సాధించాలో భారతీయ చిత్రపరిశ్రమకు తీసి మరీ చూపించిన చిత్రం బాహబలి సీక్వెల్స్, ప్రత్యేకించి బాహుబలి 2 ఇండియన్ సినిమా కలెక్షన్ల చరిత్రను మార్చిపడేసింది. రెండో భాగంలో నటించిన నటీనటులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతిక సిబ్బందికి ఇప్పుడు జాతీయ కీర్తి కాదు. అంతర్జాతీయ ప్రతిష్ట లభించింది.



ఒక భారతీయ సినిమాలోని పాటలు, దృశ్యాలు, విజువల్స్‌ని భాష అర్థం కాకున్నా దక్షిణాఫ్రికా నుంచి అమెరికా దాకా, గల్ఫ్ కంట్రీస్ నుంచి లాటిన్ అమెరికా వరకు దేశదేశాల ప్రేక్షకులు తమ సొంతం చేసుకుని అద్భుతం అంటూ వ్యాఖ్యానిస్తూ ఒక్క పదం తెలియకున్నా తెలుగులో పాటలు నేర్చుకుని పాడుతూ వీడియో అప్ లోడ్ చేస్తున్న ఘనత ఒక్క బాహుబలికి మాత్రమే దక్కింది. 
 
అలాంటి బాహుబలి సినిమాలో హీరోగా నటించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు నేషనల్‌ లెవెల్‌ స్టార్‌. ‘బాహుబలి’ సూపర్‌ సక్సెస్‌తో ఆయన రేంజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి అలాంటి స్టార్, అంత పెద్ద సక్సెస్‌ తర్వాత ప్రభాస్ చేసే సినిమా అంటే ఎలా ఉండాలి ‘సాహో’ టీమ్‌ దీన్ని దృష్టిలో పెట్టుకుంది. అందుకే సుమారు 150కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేస్తోంది. 
 
ఏప్రిల్‌ నెలలో కేవలం టీజర్‌ కోసమే ఒక్క రోజు షూట్‌ జరిపినా, పూర్తి స్థాయిలో మాత్రం ‘సాహో’ నిన్ననే సెట్స్‌ పైకెళ్ళింది. ‘రన్‌ రాజా రన్‌’తో పరిచయమైన సుజీత్‌ ఈ సినిమాకు దర్శకుడు కాగా, యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ. ‘బాహుబలి–2’ రిలీజ్‌ తర్వాత విరామం కోసం అమెరికా ట్రిప్ వెళ్ళిన ప్రభాస్‌ ఈ మధ్యే  హైదరాబాద్‌ వచ్చేశారు.

అయినా ప్రస్తుతానికి ప్రభాస్‌ లేకుండానే విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పాల్గొంటుండగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీల్‌ నితిన్‌ చేస్తోన్న మొదటి తెలుగు సినిమా ‘సాహో’నే!
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట : సీన్ రీకన్‌స్ట్రక్షన్ యోచనలో పోలీసులు...

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు : వెలుగులోకి నమ్మలేని నిజాలు ఎన్నెన్నో?

Allu Arjun చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్ (video)

నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన.. 25న క్రిస్మస్ వేడుకలు

ఇకపై 5, 8 తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణత : కేంద్ర స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments