Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (10:54 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రాన్ని విడుదల రోజే తిలకించాలని టాలీవుడ్ యువ హీరో ఒకరు భావించారు.
 
అయితే, హీరోగా వెళితే అభిమానులు గోలగోల చేస్తారని భావించిన ఆ హీరో మారు వేషం వేశాడు. తలకు టోపీ, కళ్ళకు నల్లద్దాలు, మాసిగెడ్డంతో అచ్చం బాబాలా థియేటర్‌కు వచ్చి... సినిమాను హాయిగా చూసి వెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి ఈ విష‌యాన్ని వెల్లడించాడు రాజ్ త‌రుణ్. ఇప్పుడు ఆ విష‌యం తెలుసుకున్న అమ‌లాపురం ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.
 
ఇటీవ‌ల "అంధ‌గాడు" సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీంతో అమలాపురంలోని ఓ థియేటర్‌లో ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ వీక్షించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments