చిరు పుట్టిన‌రోజున ప్లాన్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆష్టు 22. ఆరోజు అభిమానుల‌కు పండ‌గ రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం చిరు పుట్టిన‌రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ‌విదేశాల్లో ఉన్న చిరు అభిమానులు ర‌క్త‌దానాలు, పేద‌ల‌కు అన్న‌దానంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈ స

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (21:17 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆష్టు 22. ఆరోజు అభిమానుల‌కు పండ‌గ రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం చిరు పుట్టిన‌రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ‌విదేశాల్లో ఉన్న చిరు అభిమానులు ర‌క్త‌దానాలు, పేద‌ల‌కు అన్న‌దానంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈ సంవ‌త్స‌రం కూడా అలాగే చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే.. అభిమానుల కోసం చిరు, చ‌ర‌ణ్‌లు స‌ర్ఫ్రైజ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఆ స‌ర్‌ఫ్రైజ్ ఏంటంటే.. చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.
 
ఈ పుట్టిన‌రోజున చిరంజీవి సైరా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల‌నుకుంటున్నారని తెలిసింది. మ‌రో విష‌యం ఏంటంటే… ఈసారి చిరు పుట్టిన‌రోజు నాడు సైరా ఫ‌స్ట్ లుక్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, బోయ‌పాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న మూవీ ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇలా ఆగ‌ష్టు 22న చిరు, చ‌ర‌ణ్ మూవీల‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తుండ‌టం ఫ్యాన్స్‌కి డ‌బుల్ ధ‌మాకా. చర‌ణ్ మూవీ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంటే… చిరు మూవీ సైరా సమ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments