"యోధ" టీజర్... రాశిఖన్నా రోలేంటో తెలుసా?

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (16:36 IST)
Raashii khanna
బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన "యోధ" టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించిన యాక్షన్-థ్రిల్లర్ మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు అందాల రాశి రాశి ఖన్నా, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఇండియన్ పోలీస్ ఫోర్స్ తర్వాత, సిద్ధార్థ్ యోధ టీజర్‌లో మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చాడు. టీజర్‌లో, నటుడు విమానం హైజాక్‌లో చిక్కుకున్న బందీల ప్రాణాలను కాపాడుతూ థ్రిల్లింగ్ ఆపరేషన్‌లో ఉన్న కమాండోగా కనిపిస్తాడు. 
 
దిశా పటానీ క్యాబిన్ క్రూ పాత్రలో నటిస్తుండగా, రాశి ఖన్నా ప్ర‌భుత్వ అధికారిణి పాత్రలో నటిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అమెజాన్‌ స్టూడీయోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
సిద్ధార్థ్ మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కనిపిస్తాడు. సాగర్‌ అంబ్రే, పుష్కుర్‌ ఓజా ఈ సినిమాను సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments