Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ 9 రిపోర్ట‌ర్‌ని నేను తిట్టింది నిజ‌మే: హీరో సునీల్

ఇటీవ‌ల టీవీ 9లో జాఫ‌ర్ అనే రిపోర్ట‌ర్ ఇంట‌ర్వ్యూలో సునీల్ చాలా ఇరిటేట్ అయ్యాడు. నిన్ను చంపేస్తా అంటూ రిపోర్ట‌ర్ మీద సీరియ‌స్ అయ్యాడు. నిజ‌మే... ఆ రోజు నేను రిపోర్ట‌ర్‌ని తిట్టింది నిజ‌మే. గ‌తంలో అయితే... నాకున్న టెంప‌ర్‌మెంట్‌కి ఏం చేసేవాడినో అంటున్న

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (21:57 IST)
ఇటీవ‌ల టీవీ 9లో జాఫ‌ర్ అనే రిపోర్ట‌ర్ ఇంట‌ర్వ్యూలో సునీల్ చాలా ఇరిటేట్ అయ్యాడు. నిన్ను చంపేస్తా అంటూ రిపోర్ట‌ర్ మీద సీరియ‌స్ అయ్యాడు. నిజ‌మే... ఆ రోజు నేను రిపోర్ట‌ర్‌ని తిట్టింది నిజ‌మే. గ‌తంలో అయితే... నాకున్న టెంప‌ర్‌మెంట్‌కి ఏం చేసేవాడినో అంటున్నాడు హీరో సునీల్. ‘జక్కన్న’ సినిమా కోసం టీవీ 9 న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు సునీల్‌. ఆదివారం సాయంత్రం ప్రసారమయ్యే ఆ ప్రోగ్రామ్ రిపోర్ట‌ర్ సునీల్‌ను చాలా దారుణ‌మైన ప్రశ్నలు అడిగాడు. ‘మీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా?’, ‘నువ్వు పుట్టిన కులం వల్లే ఇంత పైకి వచ్చావా?’ అంటూ ప్రశ్నించాడు.
 
కావాల‌నే... న‌న్ను ఇరిటేట్ చేయ‌డానికే ఇలాంటి ప్ర‌శ్నలు ప్లాన్ చేసుకుని వ‌చ్చావా... ‘ఇలాంటి ప్రశ్నలు అడిగితే చంపేస్తా’ అని ఆ యాంకర్‌కు వార్నింగ్‌ కూడా ఇచ్చాడు సునీల్‌. అయితే అదొక ఫేక్‌ ఇంటర్వ్యూ అని, రేటింగ్ కోసం ఇలాంటి ప్రశ్నలు అడిగారని వార్తలు వచ్చాయి. వాటిపై సునీల్‌ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. ‘అది ప్లాన్‌ ప్రకారం చేసింది కాదు. ఆ రిపోర్ట‌ర్ చాలా దారుణ‌మైన ప్ర‌శ్న‌లు అడిగాడు. ఆ ప్రశ్నలకు నిజంగానే సీరియస్‌ అయ్యాను అని చెప్పుకొచ్చాడు సునీల్. 
 
ఇంటర్వ్యూ ముందే నాకు ఆ యాంకర్‌ ఈ ప్రోగ్రామ్‌లో రెగ్యులర్‌ ప్రశ్నలు కాదు.. కొంచెం స్ట్రాంగ్‌గా అడుగుతాను అని చెప్పాడు. మీ ప్రశ్నలను బట్టే నా సమాధానం ఉంటుంది అని చెప్పా. అలాగే సీరియ‌స్‌గా స‌మాధానాలు ఇచ్చా... నేను ఇప్పుడు కూల్‌గా కనబడుతున్నాను కానీ, మొదట్లో చాలా రెబల్‌గా ఉండేవాడిని అంటూ సునీల్ వివ‌రించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments