Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 7న బుల్లితెరలో మహానేత 'యాత్ర'

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:28 IST)
తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఆయన చేపట్టిన పాదయాత్ర చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను ఆ స్వయంగా చూశారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 


ఈ పాదయాత్రలో తాను చూసిన ఎన్నో సంఘటనల నుండి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటి సంక్షేమ పథకాలు పుట్టాయి. ఆ పాదయాత్రను కథాంశంగా చేసుకుని తాజాగా 'యాత్ర' పేరుతో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించారు. ఆశ్రీత వేమగంటి విజయమ్మ పాత్రను పోషించారు. రావు రమేష్ కెవిపి పాత్రలో నటించారు. ఫిబ్ర‌వ‌రి 8, 2019న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. 
 
ఈ సినిమా దాదాపు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2019 లో విడుదలైన హిట్ చిత్రాల సరసన చేరింది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 7న మాటీవీలో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు ఆ ఛానెల్ తెలిపింది. ఏప్రిల్ 11న ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నుండగా, నాలుగు రోజుల ముందు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేయడం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రదర్శించవద్దని కొంత మంది కోరుతున్నారు. ఈ చిత్రం టెలికాస్ట్ అవుతుందో లేదో చూడాలంటే 7వ తేదీ వరకు ఆగాల్సిందే మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments