Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశ్ హీరోగా నటించిన రాజధాని రౌడీ సిద్ధం

డీవీ
సోమవారం, 10 జూన్ 2024 (16:11 IST)
Yash - Rajdhani Rowdy
సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, సంచలన విజయం సాధించిన కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం" రాజధాని రౌడీ". ఈ చిత్రం జూన్ 14న విడుదల కు సిద్ధమైంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం "రాజధాని రౌడీ". వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 
 
ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది.  అత్యధిక థియేటర్లలో ఈనెల 14న విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments