Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు 'యశ్ చోప్రా' 4వ జాతీయ అవార్డు

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు 'యశ్ చోప్రా' 4వ జాతీయ అవార్డును ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పమేలా చోప్రా (దివంగత యశ్ చోప్రా సతీమణి), పద్మిని కొల్హాపురి, బోనీకపూర్‌లతో కూడిన స

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (19:42 IST)
సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు 'యశ్ చోప్రా' 4వ జాతీయ అవార్డును ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పమేలా చోప్రా (దివంగత యశ్ చోప్రా సతీమణి), పద్మిని కొల్హాపురి, బోనీకపూర్‌లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్‌చోప్రా 4వ జాతీయ అవార్డుకు గాను సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను ఎంపిక చేసింది.
 
యశ్‌చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును డా. టి. సుబ్బరామిరెడ్డి 'టి.ఎస్.ఆర్. ఫౌండేషన్' పేరుపై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతాకం, ప్రసంశా పత్రంను అవార్డు గ్రహీతకు అందించనున్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబైలోని హోటల్ మారియట్‌లో జరిగే వేడుకలో ఈ యశ్‌చోప్రా' 4వ జాతీయ అవార్డును సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు అందించనున్నట్లు డా. టి. సుబ్బరామి రెడ్డి తెలిపారు.
 
గతంలో ఈ అవార్డును సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖలు అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, ఐశ్వర్యా రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర సినీ నటులు ఈ అవార్డు వేడుకలో పాల్గొననున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments