Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్‌! సోలార్ ఎఫెక్ట్‌తో సూర్యుడు చిరంజీవి స్పంద‌న‌

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (17:15 IST)
Solar sun effect
ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించ‌డంలో ప్ర‌తివారికి మ‌క్కువే. కానీ ఆ అవ‌కాశం చాలా కొద్దిమందికే వ‌స్తుంది. వాటి అందాల‌ను మ‌మేకంగా చూస్తూ మైమ‌రిపోయేలా చేస్తుంది కొంద‌రిని. మెగాస్టార్ చిరంజీవి కూడా అందులోని వారే. ఇంత‌కుముందు మొద‌టి వేవ్ క‌రోనా టైంలో జూబ్లీహిల్స్‌లోని త‌న ఇంటిలోని స్విమ్మింగ్ ఫూల్ నుంచి ఉయ‌దంపూట‌ పైకి వ‌స్తున్న‌ట్లుగా సూర్యోద‌యాన్ని కెమెరాతో షూట్ చేసి అందరికీ ట్వీట్ చేసి ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. తాజాగా ఈరోజు కూడా సూర్యుడిని అందాన్ని త‌న కెమెరా క‌ళ్ళ‌తో బంధించారు.
 
ఈరోజు మ‌ధ్యాహ్నం జూబ్లీహిల్స్, గ‌చ్చిబౌలి, బంజారాహిల్స్‌, ఫిలింన‌గ‌ర్ ప్రాంతాల్లో ష‌డెన్ గా ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షం భారీగా ప‌డింది. దానికి ముందుగా ఆకాశంలో ఓ చిత్ర‌మైన దృశ్యం క‌నిపించింది. దాన్ని మెగాస్టార్ చిరంజీవి కెమెరాతో బంధించారు. ఆ టైంలో ఆయ‌నకు ఏమీ ప‌నిలేదా అనుకోకండి. క‌రోనా టైం క‌నుక ఆయ‌న ఇంటివ‌ద్ద‌నే వున్నారు. అయితే జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న ఇల్లు చాలా ఎత్తైన ప్ర‌దేశంలో వుంటుంది. అక్క‌డ నుంచి సిటీని చూడ‌వ‌చ్చు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే జైంట్‌విల్ ఎక్కితే పైన వున్న వాడికి ఆకాశం ఎలా క‌నిపిస్తుందో ఆయ‌న ఇంటిలో నుంచి చూస్తే అలా క‌నిపిస్తుంది. ఇంటి చుట్టూరా అద్దాలే. ప్ర‌కృతి దృశ్యం అంత క్లియ‌ర్‌గా వారికి క‌నిపిస్తుంది. అందుకే ఆయ‌న త‌న మాట‌ల‌తో చిన్న ట్వీట్ చేశాడు. 
 
వావ్‌! బ్యూటిఫుల్‌. ఈరోజు జూన్ 2, మ‌ధ్యాహ్నం 1గంట ప్రాంతంలో మా ఇంటి పైన హాల్లో సోలార్ ఎఫెక్ట్‌తో సూర్యుడు ద‌ర్శ‌నం ఇచ్చాడు. చాలా అందంగా వుంది. బ్యూటీఫుల్ సీన్ మీతో షేర్ చేసుకుందామ‌ని స‌ర‌దాగా పోస్ట్ చేశాను. చూసి ఆనందించండి అంటూ వాయిస్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రిపేర్ చేసినందుకు రూ.90వేలు బిల్లు.. అంతే విరగ్గొట్టేశాడు..! (video)

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments