Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 2' దానికి పనికిరాదు.. సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ కామెంట్స్

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న 'బాహుబలి 2' చిత్రంపై సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "బాహుబ‌లి-2 ది కంక్లూజన్" సినిమా వ‌ర్చు

Webdunia
సోమవారం, 8 మే 2017 (17:48 IST)
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న 'బాహుబలి 2' చిత్రంపై సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "బాహుబ‌లి-2 ది కంక్లూజన్" సినిమా వ‌ర్చువ‌ల్ రియాలిటీ (వీఆర్‌)కి ప‌నికిరాద‌ని తేల్చిపారేశాడు. నిజానికి గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. 
 
రెహ్మాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'లే మ‌స్క్' షార్ట్ ఫిలింపై జరిగిన చర్చా సమయంలో బాహుబలిపై కామెంట్స్ చేశారు. బాహుబ‌లి-2 సినిమా వ‌ర్చువ‌ల్ రియాలిటీ (వీఆర్‌)కి ప‌నికిరాద‌ని, వీఆర్‌లో కాసేపు చూడ‌గానే ప్రేక్ష‌కుడికి అల‌స‌ట వ‌చ్చేస్తుంద‌ని, బాహుబ‌లిలోని యుద్ధ స‌న్నివేశాల‌ను చూస్తే వ‌చ్చే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంద‌ని, అందువ‌ల్ల బాహుబ‌లి వీఆర్‌కు సరిపోదన్నారు. 
 
తాను బాహుబ‌లిలాంటి సినిమాను తీయ‌లేన‌ని, అలాంటి సినిమాల‌ను తీసేందుకు వేరే టాలెంటెడ్ డైరెక్ట‌ర్లు చాలా మందే ఉన్నార‌ని అన్నాడు. అంతేకాదు బాహుబ‌లి లాంటి సినిమా తీసేందుకు త‌న ద‌గ్గ‌ర ఉన్న బ‌డ్జెట్ స‌రిపోద‌ని, క‌నీసం రూ.200 కోట్లైనా లేకుండా బాహుబ‌లి లాంటి సినిమా తీయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని రెహ్మాన్ తెలిపాడు. 
 
''నేను సంగీతం అందిస్తాను. అంద‌మైన విజువ‌ల్స్ చూపిస్తాను. ప్రేక్ష‌కుల కోసం అంద‌మైన ప్ర‌పంచాన్నే సృష్టిస్తాను. అలాంటి అంద‌మైన ప్ర‌పంచం నుంచి వారు బ‌య‌ట‌కు రావాల‌ని అనుకోకూడ‌దు. ఈ స్టోరీలోని నెగెటివ్ యాంగిల్‌ను కూడా క‌వితాత్మ‌కంగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాను. నెగెటివ్ రివ్యూలు నా మ‌న‌సుపై ప్ర‌భావం చూప‌వు. దాని గురించి నేన‌స‌లు ప‌ట్టించుకోను. ఓ మంచి సంగీతం వినిపిస్తుంద‌ని అనుకుంటాను. అలా కాక‌పోతే ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆధ్యాత్మిక చింత‌న‌.. ఇలాంటి నెగెటివ్ వ్యాఖ్యానాలు ద‌రిచేర‌నీయ‌దు. ఆ ఆధ్యాత్మికచింత‌నే నా బ‌లం
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments