Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్మురేపుతున్న "విన్నర్" టీజర్... ఒక మిలియన్ వ్యూస్‌ కుమ్మేసింది

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతోంది. ఇప్పటికే 'బాస్ ఈజ్ బ్యాక్' పేరుతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నంబర్ 150"గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సాయిధరమ్ త

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (08:40 IST)
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతోంది. ఇప్పటికే 'బాస్ ఈజ్ బ్యాక్' పేరుతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నంబర్ 150"గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్ హవా మొదలు కానుంది. 
 
ఈ మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ - గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో నల్లమలుపు శ్రీనివాస్, 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న "విన్నర్" కొత్త పోస్టర్లు, టీజర్‌ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. విన్నర్ అంటే ఆషామాషీ విన్నర్ కాదు. రేస్ కోర్టులో గుర్రప్పందేల్లో నెగ్గుకొచ్చే విన్నర్‌.
 
ఇలాంటివి దావుద్ ఇబ్రహీంలాంటి గ్యాంగ్ స్టర్లు ఆడుకునే ఆటలు అని గతంలో విన్నాం. కానీ మన సాయిధరమ్ మాత్రం ఓ కామన్ రేసర్‌గా బరిలో దిగి దుమ్ము రేగ్గొట్టేస్తున్నాడు. గుర్రంపై రేసులో అతడు దూసుకెళుతున్న స్టయిల్ సూపర్భ్ అంటూ కాంప్లిమెంట్లు వచ్చాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన టీజర్‌కి ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. 
 
ముఖ్యంగా.. "నీలాంటోళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు ఒక్కడే ఉంటాడు" అంటూ సాయిధరమ్ చెప్పిన డైలాగులకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. కాగా, ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఎస్.ఎస్‌.థమన్ సంగీతం అందిస్తున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments