Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నీలాంటోడు అడుగడుగునా ఉంటాడు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు’ అంటున్న సాయిధరమ్

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయికగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విన్నర్‌’. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించారు. సంక్రాంతి సందర

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (12:06 IST)
మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయికగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విన్నర్‌’. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఈ చిత్రం యూనిట్ విడుదల చేసింది.
 
ఈ చిత్రంలోని డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయి. హీరో సాయిధరమ్‌ చెప్పిన.. ‘నీలాంటోడు అడుగడుగునా ఉంటాడు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు’ అనే డైలాగ్‌తో పాటు ‘అదే డేట్.. అదే టైమ్.. అదే ప్లేస్.. అదే ట్రాక్.. అదే రేస్.. నేను రెడీ’ అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. 
 
కాగా, ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ‘ఠాగూర్‌’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ టీజర్‌లో హాట్ యాంకర్ అనసూయ కూడా దర్శనమివ్వడం విశేషం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments