Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదే ప్ర‌శ్న పొలిటీష‌న్‌ను అడిగే ద‌మ్ముందాః రేణుదేశాయ్‌

Webdunia
బుధవారం, 19 మే 2021 (19:24 IST)
Redesai respond
న‌టి రేణుదేశాయ్ సెటిజ‌న్ల‌పై తీవ్రంగా స్పందించింది. వారు వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌హ‌నం కోల్పోయింది. అస‌లు క‌రోనా టైంలో సాయం చేస్తున్న వారిని ఎదురు ప్ర‌శ్నించ‌డం ఫేష‌న్ అయిపోయింది. ఇదే ప్ర‌శ్న‌ను మీరు ఓటువేసిన నాయ‌కుల్ని అడ‌గండి.అంటూ నిల‌దీసింది. ఆమె అభిప్రాయం కూడా సామాన్యుడిలోనూ వుంది. అదే ఆమె నుంచి వ‌చ్చింది.
 
వివ‌రాల్లోకి వెళితే, క‌రోనా టైంలో సినీమా వాళ్ళు కూడా బాధితుల‌కు ఎంతో కొంత ఊర‌ట క‌లిగించే సాయం చేస్తున్నారు. అందులో భాగంగా త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా అవసరం ఉన్న మేర శాయ‌ శక్తుల  సాయం చేస్తాన‌ని గత కొన్ని రోజులు నుంచి చెబుతున్నారు. ఇంకేంముంది ప‌వ‌న్ మాజీ భార్య క‌నుక మెసేజ్‌లు బాగానే వ‌చ్చాయి. కొంద‌రైతే మెసేజ్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు కూడా. దాంతో చిర్రెత్తిన రేణు వారికి ప్ర‌శ్న‌ల‌తోనే ఎదురు దాడి చేసింది. తాను చెయ్యగలిగినంతలో చేస్తున్నాన‌ని ఇప్ప‌టికే మెసేజ్ బాక్స్ అంతా నిండిపోయి ఉందని అందుకే అందరికీ రెస్పాండ్ కాలేకపోతున్నా అని తెలిపారు.
 
ఓ వ్య‌క్తి త‌ను షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో మెసేజ్ హైలైట్ చేశాడు. అందులో ఏముందంటే, తనని ప్రశ్నిస్తూ మీరు సాయం చేస్తా అన్నారు ఎక్కడ? అస‌లు సాయం ఉన్నవాళ్లనే పట్టించుకుంటున్నారా? అంటూ ఓ నెటిజన్ మెసేజెస్ పెట్టగా, దానికి ఇలాటి ప్రశ్నలు అడగడానికి నేనేమన్నా పొలిటీషియన్ నా? అని గ‌ట్టిగానే స్పందించారు. ఇలాంటి ప్రశ్నలు మీరు ఓటు వేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులను అడగండి అని బ‌ల్ల‌గుద్ది చెప్పిన‌ట్లు చెప్పారు. సాయం  విషయాల్లో కూడా డిమాండ్ చేయడం బాధ కలిగించేలా మాట్లాడ్డం తనలోని స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని తెలిపారు. మ‌రి ఆమె అన్న‌ది నిజ‌మేక‌దా. ఇదే విష‌యాన్ని పొలిటీష‌న్స్‌ను అడుగుతారా? అడిగే ద‌మ్ముందా! ఇప్ప‌టికైనా నెటిజ‌న్లు మారాల‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments