Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

దేవీ
శుక్రవారం, 21 మార్చి 2025 (17:22 IST)
Nitin
నితిన్ నటించిన రాబిన్‌హుడ్ చిత్రం మార్చి 28, 2025న గ్రాండ్ రిలీజ్ కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ చిత్రం గురించి స్టూడెంట్స్ వున్న పలు కాలేజీలలో ప్రచారం నిర్వహించారు.  అక్కడ యూత్ అడిగిన పలు ప్రశ్నకుల నితిన్ సమాధానం చెప్పారు.

అందులో ఓ ప్రశ్న నితిన్ కు కాస్త ఇబ్బంది అయినా సమాధానం చెప్పక తప్పలేదు. అయితే  రాబిన్‌హుడ్ చిత్రం యొక్క వ్యవధి చాలా పెద్దదని దానిని అల్లు అర్జున్ సూపర్‌హిట్ ఎంటర్‌టైనర్ జులాయితో పోల్చానని నితిన్ అన్నారు.
 
“ఈ చిత్రం ఎలా ఉండబోతుందో నేను మీకు చెప్పాలంటే, నేను దానిని అల్లు అర్జున్ గారి జులాయితో పోల్చగలను. జులాయిలో హీరో మరియు విలన్ మధ్య మైండ్ గేమ్‌లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే, ఇందులో అంతకుమించి కామెడీ కూడా ఉంది. రాబిన్‌హుడ్ అదే జోన్‌లో ఉంటుంది. మా సినిమాలో దేవదత్త నాగే (విలన్) కూ నాకూ మధ్య మైండ్ గేమ్‌లు ఉన్నాయి, అవి మిమ్మల్ని కట్టిపడేస్తాయి. దేవదత్త నాగే ఆదిపురుష్‌లో హనుమంతుడిగా నటించారు, ”అని నితిన్ అన్నారు.
 
"జులాయి తర్వాత, రాజేంద్ర ప్రసాద్ మరోసారి పూర్తి నిడివి గల పాత్రను పోషించారు. రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమా గురించి చెబుతూ, జులాయితోనే పోల్చారు. నితిన్ ను కొత్త కోణంలో చూస్తారు. పక్కా హిట్ ఫిలిం అని చెప్పారు. అదేవిధంగా నాకూ,  రాజేంద్ర ప్రసాద్ మధ్య సాగే సన్నివేశాలు హైలైట్ గా వుంటాయని నితిన్ అన్నారు. మరి జులయి చూసిన ఆడియన్స్ కి ఈ సినిమా ఎలా వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments