Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ్ కుమార్ పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా!

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (22:09 IST)
Prem Kumar
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ ఇతర తారాగణం. బుధవారం సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
 
గ్లింప్స్ చూస్తే... సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందర లింగానికి సోలో స్నేహితుడు, రోషన్ గాడికి రంకు మొగుడు, వరుడు చిరంజీవి చిం ప్రేమ్ కుమార్ అంటూ హీరోతో పాటు అతడి జీవితంలో కీలక పాత్రధారులను పరిచయం చేశారు. వధువుగా రాశీ సింగ్ ను సైతం చూపించారు. అయితే, పెళ్లి ఎందుకు ఆగిందనేది సస్పెన్స్ లో ఉంచారు. పెళ్లి కూతురు పీటలు ఎక్కకుండా ఎందుకు లేచిపోయింది అనేది చెప్పకుండా సినిమాపై ఆసక్తి పెంచారు.
 
దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ "ప్రేమ్ కుమార్ పెళ్లి ఆగింది సరే. అసలు ఎందుకు, ఎవరి వల్ల, ఎవరితో, ఎలా ఆగింది? అసలు పీకే కి పెళ్లి అవుతుందా? లేక అలానే ఉండిపోయి పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా? ఇంతకీ, పెళ్లి ఎప్పుడు? రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి సమాధానం దొరుకుతుంది. అప్పటివరకు మా తొలి శుభలేఖ ఇదే" అని అన్నారు.
 
నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ "హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. సంతోష్ శోభన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments