Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రముఖి 2 తో కంగనా రనౌత్ భయపెట్టిస్తుందా! విడుదల తేదీ మార్పు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (13:23 IST)
Lawrence, Vadivelu, Radhika
చంద్రముఖి లో జ్యోతిక భయపెట్టినట్లు కంగనా రనౌత్ భయపెట్టిస్తుందా! అనే చర్చ ఫిలిం ఇండస్ట్రీలో నెలకొంది. ఇప్పుడు రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కిస్తున్నారు. 

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్  28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’  చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. 
 
ముందుగా ‘చంద్రముఖి 2’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయటం లేదని, సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 
 
రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. 17 సంవత్స‌రాల క్రితం లక లక అంటూ చంద్ర‌ముఖి తన బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి చంద్రముఖి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. చంద్రముఖిగా కంగనా రనౌత్ మెప్పించనుండగా.. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు. వడివేలు తనదైన కామెడీతో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments