Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య ఫ‌స్ట్ రివ్యూ నిజ‌మ‌వుతుందా!

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (20:58 IST)
Chiru- Umair Sandhu
ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమా గురించే అంతా చ‌ర్చ‌. అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతోపాటు చిరంజీవిని, రామ్‌చ‌ర‌ణ్‌ను ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం సినిమా ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుండ‌గా క‌రోనా వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న విడుద‌ల‌ కాబోతోంది.
 
ఇంకా ఒక్క‌రోజే విడుద‌ల‌కు స‌మ‌యం వున్నందున అన్ని ప్ర‌మోష‌న్‌లు పూర్తిచేసింది చిత్ర యూనిట్‌. అయితే తాజాగా సెన్సార్ బోర్డు నుంచి వ‌చ్చిన రిపోర్ట్‌ను ఉమైర్ సందూ వివ‌రిస్తూ, ఇది పైసా వ‌సూల్ అని పేర్కొంటున్నాడు. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆచార్య సినిమా మాస్‌ను అల‌రించే చిత్రంగా వుంటుంద‌ని చెప్పాడు. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌ల‌యిక చాలా ఆస‌క్తిగా వుంటుంద‌ని పేర్కొన్నాడు.


ఇంత‌కుముందు ఆర్‌.ఆర్‌.ఆర్‌., భీమ్లానాయ‌క్ వంటి సి నిమాల‌కు ఆయ‌న విడుద‌ల‌కు ముందే రివ్యూలు ఇచ్చాడు. అయితే భీమ్లానాయ‌క్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అన్నాడు. కానీ అది కాలేదు. అప్పుడే ఆయ‌న‌పై పవ‌న్ అభిమానులు ఉమైర్ సందూ విశ్లేష‌ణ‌లు అన్ని నిజంకావ‌ని తేల్చేశారు. మ‌రి ఆచార్య గురించి ఏమి జ‌రుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments