Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకా...? లైఫ్‌టైం ఎచీవ్‌మెంటా...? అప్పుడేనా...? శ్రీదేవి @52

ఏ కాలేజ్ ... అంటే... నేనా కాలేజీనా... అనే యాడ్‌కి రివ‌ర్స్‌లో వెళుతోంది అల‌నాటి హీరోయిన్ శ్రీదేవి. రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఇంగ్లిష్ వింగ్లిష్‌తో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తమిళ నటుడు విజయ్‌కు అత్తగా న

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (17:32 IST)
ఏ కాలేజ్ ... అంటే... నేనా కాలేజీనా... అనే యాడ్‌కి రివ‌ర్స్‌లో వెళుతోంది అల‌నాటి హీరోయిన్ శ్రీదేవి. రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఇంగ్లిష్ వింగ్లిష్‌తో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తమిళ నటుడు విజయ్‌కు అత్తగా నటించిన శ్రీదేవి ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అనే సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఇప్పుడు చూస్తే... అలా అనిపించ‌దు.
 
రెండో ఇన్నింగ్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకై శ్రీదేవి ప్ర‌త్యేకంగా కాస్మొటిక్ ఆప‌రేష‌న్లు చేయించుకుని... య‌మ క్రేజీగా మారిపోయింద‌ట‌. ఎవ‌రైనా కొత్త‌వాళ్ళు చూస్తే, ఈ కుర్ర పిల్ల ఎవ‌రు అనుకునేట్లు త‌యారైంద‌ట‌. ఇప్పటికీ గ్లామర్‌ను మెయింటేన్ చేస్తూ తన కూతుళ్లకు ఏమాత్రం తీసిపోననే రీతిలో శ్రీదేవి బింకాలు పోతోంది. తాను మ‌ళ్ళీ బాలీవుడ్ సినిమాల్లో హాట్‌హాట్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌ని సిగ్న‌ల్ ఇస్తోంది.
 
అన్న‌ట్లు ఇటీవ‌ల ఓ బాలీవుడ్ ఎంట‌ర్టెయిన్మెంట్ సంస్థ వారు శ్రీదేవికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ఇద్దామని ముందుకు వ‌చ్చార‌ట‌. దీనికి శ్రీదేవి సీరియ‌స్ అయిపోయింద‌ట‌. నాకా...? లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంటా? నా వయస్సు కేవలం 52 ఏళ్ళే... అప్పుడే ఈ అవార్డు అందుకోవడం సరికాదని రిజెక్ట్ చేసింద‌ట. అవును శ్రీదేవికి ఇంకా ప‌ద‌హారేళ్ళ వ‌య‌సేనా...?!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments