Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాక్ బెంచర్స్ స్కూల్లోనైనా, పార్లమెంటులోనైనా చెడ్డవారే.. వర్మ వివాదాస్పద ట్వీట్స్

వివాదాస్పద ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు తన ట్వీట్లతో వార్తలకెక్కాడు. ఈ దఫా ఆయన ఇద్దరు మాజీ ప్రధానులనుద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేశారు. బ్యాక్ బెంచర్స్ స్కూల్లోన

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (12:51 IST)
వివాదాస్పద ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు తన ట్వీట్లతో వార్తలకెక్కాడు. ఈ దఫా ఆయన ఇద్దరు మాజీ ప్రధానులనుద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేశారు. బ్యాక్ బెంచర్స్ స్కూల్లోనైనా, పార్లమెంటులోనైనా చెడ్డవారేనంటూ వ్యాఖ్యానించారు. 
 
పార్లమెంట్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయ్, పీవీ.నరసింహారావు, సోనియా గాంధీ ఉన్న పాత ఫోటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో సోనియా ముందు వరుసలో మిగతా వారంతా ఆమె వెనుక బెంచ్‌‌లో కూర్చొన్నారు. ఈ ఫోటోపై తనదైన శైలిలో స్పందించి హడావుడి చేశాడు. బ్యాక్ బెంచర్స్ స్కూల్లోనైనా, పార్లమెంటులో అయినా చెడ్డవారేనని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఈ వివాదరాయుడు ఫోటోలో కనిపించే ముగ్గురు ఎవరో తనకు తెలియదని.. కానీ ఒకరిని మించి మరొకరు చెడ్డవారిలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించాడు.
 
ఇదే ఫోటోని రెండోసారి ఫోస్ట్ చేసి.. మహిళలను అగౌరవంగా చూసే భారతీయ పురుషుల స్వభావాన్ని ఈ ఫోటో తెలియజేస్తోందని, ఫోటోలో ఉన్న వ్యక్తులెవరో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 
 
మరోసారి(మూడోసారి) ఇదే ఫోటోని పోస్ట్ చేసి.. ఫోటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైనప్పటికీ లక్షణంగా, హుందాగా ఉన్న ఓ మహిళపై డర్టీ జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. చిత్రంలో మాజీ ప్రధానులు వాజుపేయ్, పీవీ.నరసింహరావు, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉండడంతో వర్మ ఫేస్‌బుక్ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments