ప్రమోషన్‌కు వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్.. అందుకే వెళ్లడం లేదు: నయనతార

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (16:38 IST)
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార... పలు చిత్రాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే, ఈమె నటించే చిత్రాలకు జరిగే ప్రమోషన్స్ కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. దీనిపై అనేక రకాలైన విమర్శలు వచ్చినా ఆమె ఐ డోంట్ కేర్ అంటోంది. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" చిత్రంలో నటించిన నయనతార ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. నిజానికి ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు యూనిట్ మొత్తం ప్రయత్నిస్తున్న వేళ, నయనతార మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
 
అసలు సినిమా ప్రీ ఈవెంట్‌కు కూడా ఆమె రాలేదు. సినిమా విడుదల తర్వాత కూడా ఎక్కడా కనిపించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, అందుకు కారణాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయిందట నయన్. తాను ఏదైనా సినిమా ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నా, ప్రమోషన్స్‌కు వచ్చినా, అవన్నీ ఫ్లాప్ అయ్యాయని, ఆ సెంటిమెంట్‌తోనే తాను బయటకు రావడం లేదని చెప్పిందట. నయన్ మాటలు బయటకు వచ్చిన తర్వాత, ఆమె ఇంత సెంటిమెంటలా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments