Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి చంపమన్నారు... కట్టప్ప చంపాడు... బాహుబలి మాట... ఏ బాహుబలి?

కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడంటూ ట్విస్ట్‌ ఇచ్చి.. మొదటి పార్ట్‌లో చెప్పిన దర్శకుడు రాజమౌలి.. సెకండ్‌ పార్ట్‌.. కన్‌క్లూజన్‌లో దాన్ని నివృత్తి చేయడం మామూలే. ఆ విషయమై ఎవర్ని అడిగినా అదే చెబుతారు. కాగా, ఇటీవలే తమన్నా తన పోర్షన్‌ను పోషించింది. ఈ సందర

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (16:32 IST)
కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడంటూ ట్విస్ట్‌ ఇచ్చి.. మొదటి పార్ట్‌లో చెప్పిన దర్శకుడు రాజమౌలి.. సెకండ్‌ పార్ట్‌.. కన్‌క్లూజన్‌లో దాన్ని నివృత్తి చేయడం మామూలే. ఆ విషయమై ఎవర్ని అడిగినా అదే చెబుతారు. కాగా, ఇటీవలే తమన్నా తన పోర్షన్‌ను పోషించింది. ఈ సందర్భంగా సెట్లో ఆమెను అడిగినా.. అదే సమాధానం చెప్పింది. కట్టప్ప ఎందుకు చంపాడంటే... చెబితే... ముందు రాజమౌళి నన్ను చంపేస్తాడంటూ సరదాగా వెల్లడించింది. ఇదే విషయాన్ని రానా కూడా వెల్లడించారు. 
 
అయితే.. రెండురోజుల నాడు ప్రభాస్‌ పుట్టినరోజు హైదరాబాద్‌లో జరిగింది. మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ కార్యక్రమానికి ప్రభాస్‌గానీ.. వారి సోదరుడు కానీ ఎవ్వరూ హాజరుకాలేదు. దాంతో నిరాశపడినా.. కట్టప్ప గురించి అడుగుతామని రాలేదేమోనని చర్చించుకున్నారు. 
 
అయితే.. విషయం తెలిసిన నిర్వాహకుడు.. ఫోన్‌లోనే... ప్రభాస్‌ ద్వారా మాట్లాడించగా, అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఆ సందర్భంలో సరదాగా ఓ సంఘటన జరిగింది. కట్టప్ప విషయం ప్రస్తావనకు రాగానే... రాజమౌళి చంపమన్నాడు.. చంపేశాడంటూ.. ఫోన్‌లో వాయిస్‌ విన్పించగానే.. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.. స్పాంటేనియస్‌గా.. బాహుబలి ఇచ్చిన సమాధానమన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments