Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 పోస్టర్ మహాశివరాత్రి నాడే విడుదల చేశారెందుకబ్బా?

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాహుబలి నిర్మాతలు బాహుహలి 2 కొత్త పోస్టర్‌ని విడుదల చేసారు. పోస్టర్ చూస్తుంటనే గగుర్పాటు కలిగిస్తోంది, మహాబలుడు ప్రభాస్ ఒక పాదాన్ని ఏనుగు తొండం మీద ఉంచి, మరొక పాదాన్ని దాని తలమీద ఉంచినట్లున్న దృశ్యం ఒక మహాశక్తిమంతుడి శ

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (05:25 IST)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాహుబలి నిర్మాతలు బాహుహలి 2 కొత్త పోస్టర్‌ని విడుదల చేసారు. పోస్టర్ చూస్తుంటనే గగుర్పాటు కలిగిస్తోంది, మహాబలుడు ప్రభాస్ ఒక పాదాన్ని ఏనుగు తొండం మీద ఉంచి, మరొక పాదాన్ని దాని తలమీద ఉంచినట్లున్న దృశ్యం ఒక మహాశక్తిమంతుడి శౌర్యసాహసాలను కళ్లముందు నిలువెత్తు చిత్రంగా చూపిస్తోందీ పోస్టర్. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ మహాశివరాత్రి నాడే బాహుబలి కొత్త పోస్టర్ ఎందుకు విడుదల చేసినట్లు.. 
 
బాహుబలి సినిమా తొలి భాగంలో ప్రభాస్‌ని శివ భక్తుడిలాగా చూపించారు. తొలి భాగంలో శివలింగాన్ని భుజానికెత్తుకుని  ప్రభాస్ మోస్తున్నట్లు చూపిన దృశ్యాలు సినిమా మొత్తానికే హైలైట్ అనేవిధంగా ప్రేక్షకులందరిలో ఉద్వేగాన్ని కలిగించాయి. దేశ విదేశాల్లో ఆ దృశ్యాన్ని తెరపై చూస్తున్న ప్రేక్షకులు మాన్ప్రడి పోయారంటే ఆతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా భారీతనాన్ని ఆ ఒక్క దృశ్యమే ప్రారంభంలో చూపించేసింది. ఈరోజుకీ ఆ దృశ్యం ప్రేక్షకులను, అభిమానులను గిలిగింతలు పెడుతూనే ఉంది. కాబట్టి లింగాన్ని మోసిన బాహుబలి ఇప్పుడు ఏనుగు తలపై కాళ్లు మోపిన దృశ్యాన్ని శివరాత్రి నాడు విడుదల చేయడం కంటే మంచి సందర్భం ఉంటుందా?
 
బాహుబలి రెండో బాగం 2017లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా మారింది. తొలిభాగం తన చారిత్రాత్మక నాటకీయ దృశ్యాలతో విజువల్ ఎఫెక్టులతో బాక్సాఫీసు రికార్డును తిరగరాసింది. ప్రభాస్ తొలిభాగంలో చేసిన సాహస కృత్యాలు సినీ ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసకుపోయాయి. అత్యంత కఠినంగా సాగిన స్టంట్ల కోసం ప్రభాస తన శక్తియుక్తులన్నింటినీ ధారపోశాడు. 
 
ఇప్పుడీ పోస్టర్ చూస్తుంటే దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ తొలి భాగాన్ని మించిన భారీతనాన్ని రెండోభాగంలో చూపించనున్నట్లు ఖాయంగానే తెలుస్తోంది. కొత్తపోస్టర్ ప్రేక్షుకులను సీట్లకు అతుక్కుపోయి చూసేలా సమ్మోహితులను చేస్తోంది. తొలిబాగంలో శివలింగాన్ని ఎత్తిన ప్రభాస్ ప్రేక్షకులను మూగపోయేలా చేశాడు. ఇప్పుడీ పోస్టర్ ద్వారా రెండోభాగంలో కూడా మరింతగా ప్రేక్షకులకు షాక్ తెప్పించడం ఖాయమనిపిస్తోంది.
 
బాహుబలి రెండో భాగం 2017 ఏప్రిల్ 28న విడుదల కానుంది

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments