Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టంతో కాదు.. పాత్రకు ప్రాణం పోస్తుందని ఎంపిక చేశా : రాజమౌళి క్లారిటీ

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:19 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 75 శాతం మేరకు పూర్తయింది. కానీ, కరోనా వైరస్ దెబ్బకు షూటింగ్ బంద్ చేసిన చిత్ర యూనిట్ తమ ఇళ్ళకే పరిమితమైంది.
 
కానీ, చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం డైరెక్టర్ రాజమౌళి ఎప్పటికపుడు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అలియా భట్‌ను ఎంపిక చేశారు. ఈ ఎంపికపై రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చారు.
 
'ఎంతో టాలెంట్ ఉన్న నటులు తారక్, చరణ్‌ల మధ్య ఓ అద్భుతమైన వారధిలా ఉండే 'సీత' పాత్ర కోసం నాకు ఒక నటి కావాలి. ఇది త్రికోణపు ప్రేమ కథ కాదు. సీత అమాయకంగా, హానికి గురయ్యే విధంగా ఉండాలి. అలాగే ఎంతో చలాకీతనంతో వుండాలి. అందుకే నేను అలియాభట్‌ను ఎంచుకున్నా' అంటూ రాజమౌళి ఓ ట్వీట్‌లో వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments