Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బ్రహ్మాస్త్ర" ప్రి-రిలీజ్.. అభిమానులకు సారీ చెప్పిన యంగ్ టైగర్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (14:35 IST)
Junior NTR
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాను సౌత్‌లో రాజమౌళి ప్రెజంట్ చేస్తుండడంతో తెలుగులో కూడా సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఈ ప్రమోషన్స్‌తో మరింత క్రేజ్ తీసుకురావడానికి హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
 
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు కూడా చేశారు. ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ని గెస్ట్‌గా పిలవడంతో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవుతుంది. తీరా చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయింది. 
 
పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వెంటనే పార్క్ హయత్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడే సమయంలో ముందుగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 
 
వినాయకచవితి కారణంగా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదని.. ఒక దేశ పౌరుడిగా వారి రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసి వారు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈవెంట్ అక్కడ చేయలేకపోయామని.. అందుకే ఇలా చిన్న వేదికపై మీ ముందు ఉన్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments