Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీతో బిల్లాలో నటించమన్నారు.. తెలుసుకోండి పియాస్ జీ.. మహారాణిలా బతకగలను గుర్తుంచుకోండి..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తనను బిల్లా సినిమాలో నటించాలని ప్రముఖ నిర్మాత బాలాజీ తనను సంప్రదించారని సీఎం జయలలిత.. ఖాస్‌ బాత్‌ అనే మేగజిన్‌ ఎడిటర్‌ పియోస్‌ జీకి రాసిన లేఖలో తెలిపారు. ఏదైనా ముక్కుస

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (15:42 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తనను బిల్లా సినిమాలో నటించాలని ప్రముఖ నిర్మాత బాలాజీ తనను సంప్రదించారని సీఎం జయలలిత.. ఖాస్‌ బాత్‌ అనే మేగజిన్‌ ఎడిటర్‌ పియోస్‌ జీకి రాసిన లేఖలో తెలిపారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జయలలిత.. రాజకీయాల కారణంగానో లేదో ఇతర కారణాల ద్వారానో ఇక సినిమాల్లోకి రావడం కష్టంగా మారిందని.. జయలలిత తిరిగి వెండితెరపై కనిపించే అవకాశాలు గల్లంతైనట్లేనని.. ఈ సమస్య నుంచి బయట పడేందుకు జయలలిత తెగ పోరాడాల్సి వస్తుందని ఖాస్ బాత్ ప్రచురించిన స్టోరీకి అమ్మ లేఖ ద్వారా ధీటుగా సమాధానం ఇచ్చారు. 1980 జూన్‌ 10వ తేదీన ప్రియమైన పియాస్ జీ అంటూ సంబోధిస్తూ ఆ లేఖను రాసారు.  
 
ఆ లేఖలో ఏం రాశారంటే.. మీ ఖాస్‌ బాత్‌ ఆదివారం సంచిక(మే 25, 1980)లో నాపై ఎన్నో ప్రశంసలు కురిపించారు. ముందుగా అందుకు మీకు ధన్యవాదాలు. నేను తిరిగి చిత్ర రంగంలోకి అడుగుపెట్టలేక ఇబ్బంది పడుతున్నానంటూ కూడా రాశారు. దీనిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి సమాచారం మీకు ఎవరిచ్చారో లేకుంటే నాపై మీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందో చెప్పలేను కానీ.. నిజం చెప్పాలంటే ఎన్నో గొప్ప గొప్ప అవకాశాల్ని వదులుకున్నాను.  
 
అందులో ఒకటే బిల్లా సినిమా ఛాన్స్. ప్రముఖ నిర్మాత బాలాజీ నన్ను బిల్లా సినిమా కోసం సంప్రదించారు. ఆ చిత్రంలో నాయిక పాత్రను చేయాలన్నారు. అది కూడా తమిళ సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ సరసన. నేను ఆ ఆఫర్‌‌ను తిరస్కరించిన తర్వాతే బాలాజీగారు ఆ పాత్రకు శ్రీప్రియను ఎంపిక చేశారు. 
 
ఈ విషయాన్ని బాలాజీగారు కూడా స్వయంగా ప్రకటించారు. ఇంతమంచి ఆఫర్లు వదిలేసుకున్న నేను నిజంగా సినిమాల్లోకి మరోసారి వచ్చేందుకు కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నానా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే నాకు సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. సినిమా జీవితంపై నాకు ఆసక్తి లేదు. దేవుడి దయవల్ల ఆర్థికంగా బాగానే కుదురుకున్నాను. నేను మిగిలిన జీవితమంతా కూడా మహారాణిలా బతికేయగలను ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి' అంటూ సూటిగా చెప్పాల్సిన విషయం లేఖ ద్వారా చెప్పేసి పియోస్‌ జీకి నోరు మూయించారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments