Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పులో కాలేసి పుట్టిన హాలీవుడ్... ఏ 'వుడ్' వెనుక ఏముంది?

ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న పాపానికి ఇప్పటికీ అక్కడక్కడా తెలుగువారిని మద్రాసీలు అని వ్యవహరించేస్తుంటారు. తెలుగుదేశ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని తలకెత్తుకునేవరకూ చాలావరకు మద్రాసీలుగానే వ్యవహరించబడ్డాం. అదే విధంగా అంత

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (17:28 IST)
ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న పాపానికి ఇప్పటికీ అక్కడక్కడా తెలుగువారిని మద్రాసీలు అని వ్యవహరించేస్తుంటారు. తెలుగుదేశ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని తలకెత్తుకునేవరకూ చాలావరకు మద్రాసీలుగానే వ్యవహరించబడ్డాం. అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా అనగానే గుర్తుకొచ్చేది - బాలీవుడ్. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, గోలీవుడ్, లాలీవుడ్ ... అంటూ అందరూ వుడ్‌ల వెంట పడ్డారు. అసలు ఈ వుడ్‌ల గొడవేంటి.. ఎక్కడ మొదలైందో చూద్దాం... 
 
లాస్ ఏంజెల్స్‌లో హెచ్.జె.వైట్లీ అనే పెద్దమనిషి 1886 తన హనీమూన్‌కు ఓ కొండ ప్రాంతానికెళ్లాడు. వెళ్లిన పనేదో చూసుకోకుండా ఓ ఎత్తైన ప్రదేశంలో నిల్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడట. అప్పుడు ఓ చైనా వ్యక్తి కట్టెలు (నిజమే.. ఇంగ్లీషులో wood) మోసుకెళ్తుంటే, చూసి ఊరుకోకుండా ఏం చేస్తున్నావని అడగడం.. అతను ఐ హాలింగ్ ఉడ్ (I hauling wood) అన్న దాన్ని హాలీవుడ్‌గా పొరబడి ఆ ప్రాంతానికి హాలీవుడ్ అని నామకరణం చేసాడు. ఇక దాన్ని అనుకరిస్తూ మనోళ్లు వుడ్‌ని అరువు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు మన భారతీయ వుడ్‌లు, వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసుకుందాం...
 
బాలీవుడ్ - బాంబే (ఇప్పటి ముంబై) నగరం నుండి కార్యకలాపాలు నిర్వహించే హిందీ సినీరంగం ఆ నగరాన్నే తన పేరులో చేర్చుకుని బాలీవుడ్ అయ్యింది.
 
టాలీవుడ్ - తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాల్లోని సినీ రంగం. ఆ భాష పేరుని తన పేరులో చేర్చుకుని టాలీవుడ్ అయ్యింది. అలాగే ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప దర్శకులను భారతదేశానికి అందించిన బెంగాలీ సినీరంగాన్ని సైతం టాలీవుడ్ అంటారు. టోలీగంజ్ అనే ప్రాంతం గుర్తుగా అలా పిలుస్తారు.
 
కోలీవుడ్ - తమిళనాడు రాజధాని చెన్నైలో కోడంబాక్కం అనే ఓ ప్రాంతం సినీ కార్యకలాపాలకు కేంద్రం. తమిళ సినీరంగం కాస్తా కోడంబాక్కం పుణ్యమాని కోలీవుడ్ అయిపోయింది.
 
శాండల్‌వుడ్ - కర్ణాటక అనగానే గుర్తుకొచ్చేది శాండల్ ఫారెస్ట్‌లే. ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదుగా ఆ పేరు ఎందుకొచ్చిందో
 
మాలీవుడ్ - ఇదీ టాలీవుడ్ స్టైలే. తెలుగు టాలీవుడ్ అయితే, మలయాళం మాలీవుడ్ అయ్యింది. అలాగే మరాఠీ సినీరంగాన్ని కూడా మాలీవుడ్‌గా వ్యవహరిస్తుంటారు.
 
ఇక గుజరాతీల ప్రాంతీయ భాషతో గోలీవుడ్, పంజాబీల భాషతో పాలీవుడ్‌లు ఏర్పడ్డాయి. ఆ వైట్లీ అనే పెద్దాయన పొరపాటు మూలంగా హాలీవుడ్ పుడితే, మనోళ్ల అరువు తెలివితేటల మూలంగా గ్రహపాటుగా మారి సర్వం వుడ్‌‌మయమైపోయింది.. ఓం తత్సత్!
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments