Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివగామి.. కట్టప్పతో రొమాన్స్ చేస్తుందా? అబ్బే.. ఇదేంటి?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెక్కిన బాహుబలి-2 ప్రస్తుతం రికార్డులు, కలెక్షన్లతో దూసుకుపోతోంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. పలు భాషల్లో బాహుబలి-2 రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ

Webdunia
శనివారం, 6 మే 2017 (12:35 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెక్కిన బాహుబలి-2 ప్రస్తుతం రికార్డులు, కలెక్షన్లతో దూసుకుపోతోంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. పలు భాషల్లో బాహుబలి-2 రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన నటీనటులకు యమా క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. 
 
ఇక రాజమాతకు విశ్వాసపాత్రుడిగా, నమ్మినబంటుగా, బానిసగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ మంచి మార్కులు కొట్టేశాడు. బాహుబలి-2 రిలీజ్ కావడంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం లభించింది. అయితే రాజమాతకు దండాలు పెట్టే కట్టప్ప ఆమెతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. అదీ రాజు గెటప్‌లో ఇదేంటి? అంటూ విస్తుపోతున్నారు కదూ.. అయితే చదవండి.
 
బాహుబలి-2 సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులు విరామంలో స్నాక్స్.. కూల్ డ్రింక్స్ తీసుకుని థియేటర్లోకి రావడంతో షాక్ తిన్నారు. శివగామి, పక్కన కట్టప్ప కూర్చుని రాజుగా ఆమెతో రొమాన్స్ చేయడం చూసి ఇదేంటి అనుకున్నారు. ఇంతలో కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇస్తాడు. ఆమె మురిసిపోతుంది. వీరిద్దరి రొమాన్స్ పోతీస్ యాడ్ కోసం అని అసలు విషయం తెలియవస్తుంది. ఓస్ యాడ్ కోసం శివగామి, కట్టప్ప ఇలా చేశారా అంటూ ప్రేక్షకులు అనుకున్నారు.
 
దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి పాపులర్‌ టెక్స్‌టైల్‌ బ్రాండ్‌ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్‌ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్‌ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాజుగా ఆకట్టుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments